అన్నా హజారే తిరస్కరించిన ఆరు ఫాసిస్టు షరతులు ఇవే
సమర్ధవంతమైన లోక్ పాల్ బిల్లుని పార్లమెంటు ముందుకు తేవాలనీ, ప్రధాని, న్యాయ వ్యవస్ధలను కూదా లోక్ పాల్ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేస్తూ అన్నా హజారే నిరవధిక నిరాహార దీక్షకు తలపెట్టాడు. అయితే అన్నాహజారే నిరాహార దీక్షకు కూర్చోకముందే ఆగస్టు 16 తేదీన పొద్దున్నే పోలీసులు ఆయనని అరెస్టు చేసి పట్టుకెళ్ళారు. వ్యక్తిగత ష్యూరిటి ఇవ్వడానికి హజారే నిరాకరించడంతో హజారేకి ఆరు రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధించినట్లు వార్తలు తెలుపుతున్నాయి. తాము విధించిన షరతులను హజారే అంగీకరించక…