హజారేతో పాటు నలుగురికి 7 రోజుల జ్యుడీషియల్ కస్టడీ, తీహార్ జైల్లో ఉంచే అవకాశం
ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన అన్నా హజారే, ఆయన బృందంలోని సభ్యులైన కిరణ్ బేడీ, అరవింద్ కేజ్రీవాల్, శాంతి భూషన్ లకు ప్రత్యేక మెజిస్టీరియల్ కోర్టు ఏడు రోజుల పాటు జ్యుడిషయల్ కస్టడీ విధించింది. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి జయప్రకాష్ నారాయణ పార్కులో నిరవధిక నిరాహార దీక్షకు కూర్చుంటానని అన్నా హజారే ప్రకటించడంతో ఆయనని అరెస్టు చేశామని ఢిల్లీ పొలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్నా హజారే వ్యక్తిగత బాండు సమర్పించడం ద్వారా బెయిల్ పొందవచ్చునని కోర్టు షరతు…