‘కాబూల్ దాడి’ సూత్ర ధారి పాకిస్ధానీ ‘హకానీ నెట్ వర్క్’
ఆదివారం మధ్యాహ్నం నుండి సోమవారం ఉదయం వరకూ కొనసాగిన ‘కాబూల్ దాడి’ నిర్వహించింది పాకిస్ధాన్ కి చెందిన ‘హక్కానీ గ్రూపు’ అని అసోసియేటేడ్ ప్రెస్ తెలిపింది. కాబూల్ తో పాటు మరో మూడు ఆఫ్ఘన్ నగరాలపైన దురాక్రమణకి వ్యతిరేకంగా పోరాడుతున్న మిలిటెంట్లు ఒకేసారి దాడులకు పాల్పడ్డారు. ‘దురాక్రమణకు తాలిబాన్ ప్రతిఘటన బలహీన పడిందని ఫిబ్రవరిలో వ్యాఖ్యానించిన అమెరికాకి తమ అంచనా తప్పని తెలియజేయడానికే ఈ దాడులకు పాల్పడ్డామని తాలిబాన్ ప్రతినిధి జబీయుల్లా తెలిపాడు. తమ ‘వేసవి దాడులకు’…
