(ఖాతాదారుల) వెల్లడికి మించి వెళ్లాలి… -ది హిందు ఎడిట్
పన్నుల విషయాల్లో గోప్యత అనేది ప్రాధమిక (అధికార) కార్యకలాపాల్లో అనుసరించవలసిన ప్రక్రియలలో తప్పనిసరి భాగమే కాకుండా పన్నుల ఎగవేతను నివారించేందుకు కావలసిన అంతర్జాతీయ సహకారంలో అత్యవసర దినుసు కూడా. అయితే, ఇతర దేశాలు పంచుకున్న వివరాలపై తగిన విధంగా చేయవలసిన పరిశోధనను ఎగవేసేందుకు అది సాకు కారాదు. కేంద్ర ప్రభుత్వం సీల్డ్ కవర్ లో 627 మంది పేర్లతో కూడిన జాబితాను అందించక తప్పని పరిస్ధితి కేంద్ర ప్రభుత్వానికి వచ్చేలా సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడంలో మనకు…
