స్వాతిని నేను చంపలేదు -మలుపు?
స్వాతి హత్య కేసు విషయంలో పోలీసుల కథనం ఆరంభం లోనే సంధి కొట్టింది. వారం రోజుల వేట అనంతరం పట్టేశామని ప్రకటించిన నిందితుడు, తాను అసలు నిందితుడునే కాననీ, తనకు సంబంధం లేని కేసులో తనను పోలీసులు ఇరికించారనీ పోలీసులు అరెస్టు చేసిన రాం కుమార్ చెబుతున్నాడు. అయితే గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ వలసిన అగత్యం ఎందుకు వచ్చింది అన్న ప్రశ్నకు అతని వద్ద సమాధానం సిద్ధంగా ఉంది. “నేనసలు ఆత్మహత్యకు పాల్పపడ లేదు” అని…