మాంద్యం (recession) లో స్పెయిన్
డబుల్ డీప్ రిసెషన్ జాబితాలో స్పెయిన్ కూడా చేరింది. 2012 మొదటి క్వార్టర్ లో స్పెయిన్ జి.డి.పి క్షీణించింది. 2011 చివరి క్వార్టర్ లో కూడా స్పెయిన్ జి.డి.పి తగ్గుదల నమోదు చేయడంతో స్పెయిన్ కూడా మాంద్యం లో ఉన్నట్లయింది. రెండు క్వార్టర్లు వరుసగా ప్రతికూల వృద్ధి నమోదు చేసినట్లయితే అలాంటి ఆర్ధిక వ్యవస్ధ గల దేశం మాంద్యం ఎదుర్కొంటున్నట్లుగా పరిగణిస్తారు. 2008 నాటి సుదీర్ఘ మాంద్యం నుండి కోలుకోక మునుపే రెండవ సారి రిసెషన్ లోకి…

