పొదుపు చర్యలపై ఈజిప్టు తరహాలో ఉద్యమిస్తున్న స్పెయిన్ యువత
ఇప్పటికే మూడు దేశాలను, గ్రీసు, ఐర్లండు, పోర్చుగల్, బలితీసుకున్న యూరప్ అప్పు సంక్షోభం స్పెయిన్‌ను అతలాకుతలం చేస్తోంది. బడ్జెట్ లోటు తగ్గించడానికి స్పెయిన్ ప్రభుత్వం వరుసగా ప్రవేశపెడుతున్న పొదుపు చర్యలు స్పెయిన్ ప్రజలను వీదులపాలు చేస్తున్నది. యూరోపియన్ యూనియన్‌లోనే అత్యధికంగా స్పెయిన్‌లో 21.3 శాతం నిరుద్యోగం ఉంది. పొదుపు విధానాల పుణ్యమాని ఇది ఇంకా పెరుగుతోంది. యువతలో నూటికి 45 మంది నిరుద్యోగులుగా ఉన్నారు. పరిస్ధితి ఇలా ఉంటే ప్రభుత్వం పదవీ విరమణ వయస్సును పెంచి నిరుద్యోగుల…