ప్రశ్న: జి.డి.పి, ప్రపంచీకరణ వగైరా…

కె.బ్రహ్మం: జి.డి.పి, గ్లోబలైజేషన్ అంటే ఏమిటి? సాంకేతిక పరిజ్ఞానం, వృద్ధిల విషయంలో అమెరికా, ఐరోపాలు ప్రత్యేకంగా ఎందుకు ఉన్నాయి? సమాధానం: బ్రహ్మం గారు ప్రశ్న వేసి దాదాపు రెండు వారాల పైనే అయింది. ఇంకా ఐదారుగురు మిత్రులకు నేను సమాధానం బాకీ ఉన్నాను. ఆలస్యానికి విచారిస్తున్నాను. బ్రహ్మం గారి ప్రశ్నకు మొదట సమాధానం ఇస్తున్నాను. జి.డి.పి: Gross Domestic Product అనే పదబంధానికి జి.డి.పి పొట్టిరూపం. తెలుగులో స్ధూల జాతీయోత్పత్తి అని అంటారు. స్ధూల దేశీయోత్పత్తి అన్నా…