రంగులను చూడడంలో స్త్రీ, పురుషుల మధ్య తేడా -బొమ్మ
ఈ బొమ్మ సైంటిఫిక్ కోణం నుండి గీసినది కాదు. శాస్త్ర పరంగా ఈ బొమ్మ కరెక్టు కాదు. ఇది సామాజిక కోణం నుండి చూస్తూ గీసిన చిత్రం. స్త్రీలు బాగా అలంకరించుకుని అందంగా తయారై అందర్నీ ఆకట్టుకోవలసిన బాధ్యత ఉన్నదని సమాజం నేర్పింది. ఉంటే వంటిల్లు, బైటికొస్తే భర్త పక్కన అందమైన భార్యగా, ఆమె అందాన్ని చూసి ఆమె భర్త పట్ల పలువురు ఈర్ష్య పడేలా ఉండాలని సమాజం వివిధ నియమ నిబంధనల ద్వారా స్త్రీలకు నేర్పింది.…