రేప్ కాదు… పరస్పర అంగీకారమే, అనూహ్య మలుపు తిరిగిన స్ట్రాస్ కాన్ కేసు
ఐ.ఎం.ఎఫ్ మాజీ అధ్యక్షుడు డొమినిక్ స్ట్రాస్ కాన్ కేదు అనూహ్య మలుపు తిరిగింది. జరిగింది రేప్ కాదనీ, పరస్పర అంగీకారంతోనే జరిగిందనీ తాజా వివరాలను బట్టి అర్ధమవుతున్నదని న్యూయార్క్ ప్రాసిక్యూటర్లు నమ్ముతున్నట్లు తెలుస్తోంది. బాధితురాలుగా చెప్పబడుతున్న మహిళ, తన వ్యక్తిగత వివరాల గురించి పదే పదే అబద్ధాలు చెబుతుండడంతో ఆమె విశ్వసనీయతపై ప్రాసిక్యూటర్లు నమ్మకం కోల్పోయారని రాయిటర్స్, న్యూయార్క్ టైమ్స్, బిబిసి వార్తా సంస్ధలు తెలిపాయి. ఫలితంగా స్ట్రాస్ కాన్పై నమోదు చేసిన కేసు తేలిపోయే అవకాశాలున్నాయని…