చనిపోయిన రైతుల లెక్కల్లేవు, పరిహారం ఇవ్వలేం -కేంద్రం

మోడి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం చనిపోయిన రైతుల కుటుంబాల దీన పరిస్ధితితో తనకు సంబంధం లేదని చేతులు దులిపేసుకుంది. తమ నిర్లక్ష్యం, రైతుల పట్ల బాధ్యతారాహిత్యం కారణంగా ఏడాది పాటు చలికి వణుకుతూ, ఎండలో ఎండుతూ, వానలో నానుతూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలో పాల్గొనడం వలన అర్ధాంతరంగా చనిపోయిన రైతులకు సంబంధించిన రికార్డులు తమ వద్ద లేనందున వారి కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించే ప్రసక్తే తలెత్తదని స్పష్టం చేసింది. అసలు కనీస తర్కం కూడా…