స్కార్పిన్: లీక్ అయింది ఫ్రాన్స్ లోనే -నిర్ధారణ
ఇప్పుడిక ఫ్రాన్స్ సాకులు చెప్పి తప్పించుకునేందుకు వీలు లేదు. “లీకేజి మా పాపం కాదు. మా చేతులు దాటినాకే సమాచారం లీక్ అయింది” అని ప్రకటించి తప్పించుకోజూచిన DCNS కంపెనీ వాదన నిజం కాదని తేలింది. లీకేజికి కారణం అయిన పత్రిక విలేఖరి “ఫ్రాన్స్ లోనే లీక్ అయింది” అని స్పష్టం చేసాడు. తనకు అందిన రహస్య పత్రాలను ఆస్ట్రేలియా ప్రభుత్వానికి అందజేయడానికి ఆ విలేఖరి సంసిద్ధత తెలిపాడు. DCNS కంపెనీతో ఆస్ట్రేలియా కూడా 38 బిలియన్…