రిఫరెండం పూర్తైనా స్కాట్లండ్ భారమే -కార్టూన్
సెప్టెంబర్ 18 తేదీన జరిగిన రిఫరెండంలో యు.కెలో భాగంగా ఉండడానికే మెజార్టీ స్కాట్లండ్ ప్రజలు (55%)నిర్ణయించారు. రిఫరెండంలో విడిపోవడానికే స్కాట్ లు నిర్ణయిస్తారని భయపడిన యు.కె రాజకీయ పార్టీలు ఫలితాలతో ఊపిరి పీల్చుకున్నారు. యు.కెలో కొనసాగడానికే స్కాట్ ప్రజలు నిర్ణయించుకున్నప్పటికీ యునైటెడ్ కింగ్ డమ్ స్కాట్లండ్ భారం కొనసాగుతూనే ఉందని కార్టూన్ సూచిస్తోంది. అది నిజమే. ఎందుకంటే స్కాట్లండ్ రిఫరెండం దగ్గరపడే కొద్దీ స్కాట్లండ్ స్వతంత్రానికి ఆదరణ పెరుగుతూ పోయింది. చివరి రోజుల్లో ఇరు పక్షాలు సమాన…
