ఒబామా దర్శకత్వంలో యాక్షన్ ధ్రిల్లర్: ‘ఇరాన్ కాన్స్పిరసీ’ -కార్టూన్

అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా దర్శకత్వంలో గొప్ప యాక్షన్ ధ్రిల్లర్ విడుదల కానుంది. గతంలో ప్రచ్ఛన్నయుద్ధ కాలం నాటి హాలీవుడ్ సినిమాల్లో సోవియట్ రష్యా గూఢచారులు, కంపెనీలు, అధికారులు విలన్లుగా ఉండేవారు. ప్రచ్ఛన్నయుద్ధం అంతం అయ్యాక విలన్లకు కరువు ఏర్పడింది. కాని త్వరలోనే అమెరికా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కృత్రిమ విలన్లను తయారు చేసుకుంది. ‘టెర్రరిజం’ కధలను ధీమ్ గా చేసుకుంటూ ఆఫ్ఘనిస్ధాన్, ఇరాక్, లిబియా, ఇరాన్ దేశాలను ‘రోగ్ స్టేట్స్’ అనీ, ‘యాక్సిస్ ఆఫ్ ఈవిల్’…