ప్రధాని మంచోడే, రిమోట్ కంట్రోల్ తోనే సమస్య -అన్నా హజారే
భారత రాజకీయ నాయకులు , బ్యూరోక్రట్ల అవినీతిని అంతం చేయడానికే కంకణం కట్టాడని భావిస్తున్న అన్నా హజారే తాజాగా సోనియా గాంధీని తన విమర్శలకు లక్ష్యంగా చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. బెంగుళూరులో ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన ప్రధాని మన్మోహన్ సింగ్కు క్లీన్ సర్టిఫికెట్ ఇస్తూ రిమోట్ కంట్రోలు వల్ల సమస్యలు వస్తున్నాయని సంచలన ప్రకటన చేశాడు. “ప్రధాన మంత్రి మంచి వ్యక్తి. ప్రధాన మంత్రి చెడ్డవాడు కాడు. రిమోట్ కంట్రోలు కారణంగా సమస్యలు వస్తున్నాయి” అని…