సోచి వింటర్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవ విన్యాసాలు అద్భుతం! -ఫోటోలు

22వ శీతాకాల ఒలింపిక్స్ రష్యా నగరం సోచి లో ప్రారంభం అయ్యాయి. సిరియా కిరాయి తిరుగుబాటు విషయంలో అధ్యక్షుడు బషర్ కి మద్దతు ఇవ్వడం మానుకుంటే టెర్రరిస్టు దాడులకు గురికాకుండా సజావుగా సాగేలా చూస్తామని సౌదీ రాచరిక ప్రభుత్వంలో గూఢచార విభాగ నేత ప్రిన్స్ బందర్ బేరం పెట్టిన వింటర్ ఒలింపిక్స్ ఇవే. విఫలం అయినా, ఆటంకాలు ఎదురైనా విరుచుకుపడి దాడి చేద్దామని పశ్చిమ పత్రికలు ఆత్రంగా ఎదురు చూస్తున్న ఒలింపిక్స్ కూడా ఇవే. ఒలింపిక్స్ కు…

రష్యాలో ఆత్మాహుతి దాడి, 16 మంది దుర్మరణం

రష్యాలోని వోల్వోగ్రాడ్ పట్టణ రైల్వే స్టేషన్ లో పట్ట పగలు ఆత్మాహుతి దాడి జరిగింది. ఒక మహిళా మిలిటెంటు తనను తాను పేల్చుకోవడంతో 16 మంది మరణించారని రష్యా టుడే పత్రిక తెలిపింది. మరో 37 మంది గాయపడ్డారని, వారిలో 8 మంది పరిస్ధితి ప్రమాదకరంగా ఉందని తెలుస్తోంది. ఆత్మాహుతి దాడికి పాల్పడిన మహిళ పేరు ఒక్సానా అస్లనోవా అని అనధికార వర్గాలను ఉటంకిస్తూ ఆర్.టి తెలిపింది. మరణాల సంఖ్యను రష్యా పరిశోధనా సంస్ధ ధృవీకరించింది. వోల్గోగ్రాడ్…