జమ్ము జైలులో పాకిస్ధానీ ఖైదీపై దాడి, విషమం
పదుల వేల సంఖ్యలో ప్రజలు సరబ్ జిత్ సింగ్ అంతిమ యాత్రలో పాల్గొనేందుకు భిఖివింద్ గ్రామం చేరుకుంటుండగానే జమ్ము జైలులో ఒక పాకిస్ధానీ ఖైదీ పైన దాడి జరిగింది. 64 సంవత్సరాల సోనాయుల్లా ఖాన్ ఈ దాడిలో తీవ్రంగా గాయపడి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఉత్తర ఖండ్ రాష్ట్రానికి చెందిన భారతీయ ఖైదీ, వినోద్ కుమార్, శుక్రవారం ఉదయం ఆయనపై దాడి చేసినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత తగాదాయే దాడికి కారణమని పత్రికలు చెబుతున్నాయి.…