చైనాలో కోకాకోలా గూఢచర్యం?

తమ నైఋతి రాష్ట్రంలో కోకాకోలా కంపెనీ చట్ట విరుద్ధంగా మేపింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోందని చైనా ఆరోపించింది. ఇరు దేశాల మధ్య ‘సైబర్ గూఢచర్యం‘ ఆరోపణలు ఉధృతంగా సాగుతున్న నేపధ్యంలో అమెరికా కంపెనీపై ఆరోపణలకు ప్రాధాన్యత ఏర్పడింది. తమ దేశంపై జరుగుతున్న సైబర్ దాడుల్లో అత్యధికంగా అమెరికా నుండి వస్తున్నాయని చైనా, చైనా నుండి వస్తున్నాయని అమెరికా ఇటీవల ప్రకటనల యుద్ధం సాగించాయి. చేతితో ఉపయోగించే GPS (Global Positioning System) పరికరాలతో రహస్య భూభాగాలను మేపింగ్ చేసే…