చైనా చేతిలో అమెరికా మిలట్రీ రహస్యాలు
ఒక అమెరికా మిలట్రీ కాంట్రాక్టర్ లాప్ టాప్ ను హ్యాక్ చెయ్యడం ద్వారా అమెరికాకి చెందిన అతి కీలక మిలట్రీ రహస్యాలను దొరకబుచ్చుకున్నారు చైనా మిలట్రీ హ్యాకర్లు. ఒకటి, రెండూ కాదు ఏకంగా మూడేళ్ళ పాటు అమెరికా మిలట్రీకి చెందిన మిలియన్ల కొద్దీ డాక్యుమెంట్లను లేదా టెరా బైట్ల కొద్దీ డేటాను షాంఘై ఆధారిత హ్యాకర్ గ్రూప్ ఒకటి సంపాదించగలిగింది. “కామెంట్ క్రూ” గా పిలుస్తున్న ఈ హ్యాకర్ గ్రూపు పనితనాన్ని తక్కువ చేయడానికి కాంట్రాక్టర్ సంస్ధ…


