ఆఫ్ఘన్ సైనిక ఉపసంహరణ: ఆందోళనలో అమెరికా సైనికాధిపతులు

అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రకటించిన సైనిక ఉపసంహరణ అమెరికా సైనికాధికారులకు ఒక పట్టాన మింగుడుపడ్డం లేదు. ఉపసంహరించనున్న సైనికుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందనీ, ఉపసంహరణ విషయంలో తమ అధ్యక్షుడు మరీ దూకుడుగా ఉన్నాడనీ వాళ్ళు భావిస్తున్నారు. జాయింట్ ఛీఫ్స్ ఆఫ్ స్టాఫ్‌కు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న అడ్మిరల్ మైఖేల్ ముల్లెన్, ఆఫ్ఘనిస్ధాన్‌లో ఉన్నత స్ధాయి కమాండర్ డేవిడ్ పెట్రాస్‌లు ఒబామా ప్రకటించిన సంఖ్య “దూకుడు”గా ఉందని వ్యాఖ్యానించినట్లుగా వాల్‌స్ట్రీట్ జర్నల్పత్రిక తెలిపింది. వీరిద్ధరూ ఉపసంహరణ అమెరికా ఉపకరిస్తుందా…