తిరుగుబాటుదారులనుండి ఆయిల్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న గడ్డాఫీ బలగాలు
లిబియా రాజధానికి పశ్చిమంగా 48 కి.మీ దూరంలో ఉన్న జావియా పట్టణాన్ని ఈ వారం మొదట్లో తిరుగుబాటుదారుల నుండి స్వాధీనం చేసుకున్న గడ్డాఫీ బలగాలు, శనివారం నాటికి ట్రిపోలీకి తూర్పు దిశలో 600 కి.మీ దూరంలో ఉన్న ఆయిల్ పట్టణం ‘రాస్ లానుఫ్’ ను స్వాధీనం చేసుకున్నారు. రాస్ లానుఫ్ లో ఉన్న తిరుగుబాటు బలగాలను రాసులానుఫ్ పట్టణ శివార్లనుండి 20 కి.మీ తూర్పుకు నెట్టివేసినట్లుగా తిరుగుబాటుదారుల నాయకులు విలేఖరులకు తెలిపారు. గడ్డాఫీ మంత్రివర్గంలో హోం మంత్రిగా…