శివసేన గూండాయిజంపై మహారాష్ట్ర ఉపాధ్యాయుల ఐక్య పోరాటం

మహారాష్ట్ర మునిసిపల్ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో అక్కడ ‘సేన’ అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. తమకు తామే సంస్కృతీ పరిరక్షకులుగా ప్రకటించుకుంటూ ఇరు ‘సేన’ లు, శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎం.ఎన్.ఎస్), స్కూళ్ళలో అక్రమాలను అరికడతాంటూ బయలుదేరి టీచర్లపై భౌతిక దాడులు చేస్తుండడంతో అవి పాఠశాలల ఉపాధ్యాయులకు పెద్ద సమస్యగా మారాయి. నేరాలు వారే నిర్ధారిస్తూ, శిక్షలు కూడా వారే వేస్తుండడంతో ఉపాధ్యాయులకు పరిస్ధితి దిన దిన గండంగా మారింది. దానితో సేన ల అఘాయిత్యాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అగత్యం…