రు. 76 వేల కోట్ల వసూలు ఇక కష్టమే -సెబి

కంపెనీలు పాల్పడిన వివిధ అవినీతి వ్యవహారాల వలనా, చిన్నా పెద్దా మదుపుదారుల నుండి పెట్టుబడులను మోసపూరితంగా వసూలు చేయడం వలనా, సెబి విధించిన అపరాధ రుసుముల వలనా, ఇంకా అనేక ఇతర కారణాల వలనా, వసూలు కావలసిన మొత్తంలో రు 76,293 కోట్లు వసూలు కావటం ఇక కష్టమే అని సెక్యూరిటీ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) ప్రకటించింది. సెబి, ఇలాంటి వసూలు కావటం కష్టంగా మారే వాళ్ళ జాబితాను క్రమం తప్పకుండా యేటా తయారు…

సెబి రెగ్యులేటర్ రూల్స్ ఉల్లంఘించింది -రాయిటర్స్

అమెరికాకు చెందిన పరిశోధన సంస్థ మరియు షార్ట్ సెల్లర్ అయిన హిండెన్ బర్గ్ రీసర్చ్, సెబి రెగ్యులేటర్ (సెబి ఛైర్మన్) మాధాబి పూరి బక్ పై చేసిన ఆరోపణలలో వాస్తవం ఉన్నట్లు తమ పరిశోధనలో తేలినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ ప్రకటించింది. హిండెన్ బర్గ్ రీసర్చ్ గతంలో ఆదాని కంపెనీపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి విదితమే. అదాని గ్రూప్ కంపెనీ భారీ అప్పుల్లో కూరుకుపోయి ఉన్నదనీ, టాక్స్ హేవెన్ (పన్నులు అతి తక్కువగా ఉండే) దేశాలను…

మొఖంపై సిరా మరకలు, కెరీర్ పై కస్టడీ మరకలు

‘మరక మంచిదే’ తమ బట్టల సబ్బు ఉత్పత్తిని మార్కెట్ చేసుకోవడానికి ఓ కంపెనీ ప్రచారం చేసే నినాదం ఇది. ఒక సబ్బుల కంపెనీ తన లాభాలు పెంచుకోవడానికి ఎవరూ ఇష్టపడని మరకను కూడా మంచిదే అని చెప్పగలదని నిరూపించే నినాదం కూడా ఇది. ఈ రోజు సుబ్రతా రాయ్ ఎదుర్కొన్న చేదు అనుభవాలు బహుశా ఆయనకు ఈ నినాదాన్నే స్మరించుకునేలా చేసి ఉంటాయి. మొఖంపై పడ్డ సిరా మరక, కోర్టులో పడ్డ కస్టడీ మరక రెండూ మంచివే…

సహారా: డబ్బెక్కడిదో చెప్పు లేదా సి.బి.ఐని పిలుస్తాం

సహారా కంపెనీల మోసం కేసులో సుప్రీం కోర్టు మళ్ళీ కొరడా విదిలించింది. సుప్రీం ఆదేశాల మేరకు మదుపుదారులకు 22,000 కోట్లు చెల్లించేశానని సహారా కంపెనీ చెప్పడంతో సుప్రీం కోర్టు మోసం శంకించినట్లు కనిపిస్తోంది. అంత డబ్బు ఎక్కడి నుండి తెచ్చి చెల్లించారో వివరాలు ఇవ్వాలని కోరింది. ‘డబ్బు ఎక్కడిదో మీకు అనవసరం’ అని సెబికి బదులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. డబ్బు ఎక్కడిదో చెప్పాలని లేదా సి.బి.ఐ విచారణకు ఆదేశిస్తామని సహారా అధినేత సుబ్రతో రాయ్…

సహారా నిలువు దోపిడి: పెట్టుబడిదారీ విధానం అంటే ఇదే

ప్రజల కష్టార్జితాన్ని పెట్టుబడిదారీ కంపెనీలు దోచుకుని జల్సా చేస్తాయన్న సంగతి చరిత్రలో అనేక కంపెనీలు అనేక సార్లు రుజువు చేశాయి. 2008 నాటి ప్రపంచ ఆర్ధిక సంక్షోభాన్ని తెచ్చిన వాల్ స్ట్రీట్ కంపెనీల పేరాశ, ఇన్వెస్టర్ల సొమ్ము కాజేసి తాము మేపే అమెరికా, బ్రిటన్ ప్రభుత్వాల చేత కూడా గడ్డి పెట్టించుకున్న గోల్డ్ మేన్ సాచ్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు, అంతర్జాతీయ ప్రామాణిక ఫైనాన్స్ వడ్డీ రేటు అయిన లిబర్ (Libor – London Interbank Offered…