మీ ఇష్టారీతిన జోక్యం చేసుకుంటే ప్రజాస్వామ్యం ఉంటుందా? -సుప్రీం కోర్టు

బిజెపి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏఏపి ఆధ్వర్యం లోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ని ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తున్న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాను ఈ రోజు సుప్రీం కోర్టు ధర్మాసనం తీవ్రంగా అభిశంచింది. (అభిశంసన అన్న పదాన్ని టెక్నికల్ అర్ధంలో రాయలేదు. పాఠకులు గమనించగలరు.) మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసిడి) కి చెందిన స్టాండింగ్ కమిటీ లో 6వ…

సిజెఐ ఇంట్లో గణపతి పూజ: మోడీకి ఆహ్వానం!?

భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, భారీ రాజ్యాంగ సంక్షోభానికి తెర తీశారు. వినాయక చవితి పండుగ సందర్భంగా తన ఇంట్లో గణపతి పూజ జరిపిన చీఫ్ జస్టిస్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడి గారిని తన ఇంట్లో జరుగుతున్న పూజకు ఆహ్వానించారు. ఈ చర్య తీవ్ర విమర్శలకు కారణం అయింది. అత్యంత ఉన్నతమైన రాజ్యాంగ పదవిలో ఉన్న జస్టిస్ డివై చంద్రచూడ్, రాజ్యాంగం నిర్దేశించిన “అధికారాల సమాన విభజన” (Separation of…