భారత షేర్ల సూచి ‘సెన్సెక్స్’ టార్గెట్‌ అంచనా తగ్గించిన యు.బి.ఎస్ బ్యాంకు

ప్రవేటు వెల్త్ మేనేజ్‌మెంట్ వ్యాపారంలో ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద ఇన్‌వెస్ట్‌మెంట్ బ్యాంకుగా ప్రసిద్ధి చెందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ (యుబిఎస్) భారత దేశానికి చెందిన బోంబే స్టాక్ ఎక్ఛేంజ్ (సెన్సెక్స్) సూచిపై గతంలో తాను అంచనా వేసిన లక్ష్యాన్ని బాగా తగ్గించింది. యు.బి.ఎస్ సెన్సెక్స్ సూచి 22,500 పాయింట్లకు చేరుకుంటుందని అంచనా వేయగా, ప్రస్తుతం దానిని 21,000 పాయింట్లకు తగ్గించింది. లాభాల సంపాదనలో ప్రతికూల ఒరవడిలో ఉన్నందున సెన్సెక్స్ లక్ష్యాన్ని తగ్గిస్తున్నట్లుగా అది తెలిపింది.…