పాటియాలా హౌస్ కోర్ట్: సంఘటనల క్రమం

ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టులో ఈ రోజు కన్హైయా కుమార్ ని పోలీసులు హాజరు పరచవలసి ఉంది. వాస్తవానికి నిన్ననే విచారణ జరగవలసి ఉండగా హిందూత్వ లాయర్ల వీరంగం వల్ల అది సాధ్యపడలేదు. ఈ రోజుకు వాయిదా వేశారు. ఈ రోజు కోర్టు సజావుగా నడవడానికి సుప్రీం కోర్టు నిర్దిష్ట ఆదేశాలు ఇచ్చింది. ఐదుగురు విలేఖరులు, ఇద్దరు కన్హైయా మద్దతుదారులు మాత్రమే హాజరు కావాలని చెప్పింది. ఈ నేపధ్యంలో మధ్యాహ్నం నుండి పాటియాలా హౌస్ కోర్టులో జరిగిన…

ప్రజల డాక్టరు డా.బినాయక్ సేన్ కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

సెడిషన్ ఆరోపణలపై యావజ్జీవ శిక్షను ఎదుర్కొంటున్న డాక్టర్ బినాయక్ సేన్ ను సుప్రీం కోర్టు శుక్రవారం బెయిల్ పై విడుదల చేసింది. “మనది ప్రజాస్వామ్య వ్యవస్ధ. ఆయన మావోయిస్టులకు సానుభాతిపరుడు మాత్రమే. అంతమాత్రాన ఆయనను సెడిషన్ ఆరోపణల కింద దోషిగా నిర్ధారించలేము.  సానుభూతిపరుడు తప్ప అంతకంటే ఏమీకాదు” అని సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కోంది. బినాయక్ సేన్ విడుదల వార్త తెలిస్తే ఆయన వైద్య సేవ చేసిన చత్తీస్ ఘడ్ లోని గిరిజన తెగల ప్రజలు…