చైనాకు పోటీగా కాశ్మీరులో భారత్ బలప్రదర్శన
చైనా సైనికులు మరొకసారి దౌలత్ బేగ్ ఓల్డి సెక్టార్ (డి.బి.ఓ సెక్టార్) లో చొచ్చుకు వచ్చారన్న వార్తల నేపధ్యంలో భారత ప్రభుత్వం చైనాకు గట్టి సంకేతాలు ఇవ్వాలని నిశ్చయించుకున్నట్లు కనిపిస్తోంది. పాక్ యుద్ధంలో వాడి వదిలేసిన విమాన కేంద్రాన్ని తిరిగి వినియోగంలోకి తేవడమే కాకుండా మంగళవారం సైనికులను పెద్ద మొత్తంలో చేరవేసే సైనిక వాహక విమానాన్ని అక్కడ దించింది (touch down). వాస్తవాధీన రేఖ (Line of Actual Control)కు సమీపంలో చైనా సైనికులు చొరబడ్డారని చెబుతున్న…