అమెరికా గురుద్వారాలో 6గురు సిక్కులను కాల్చి చంపిన తెల్ల దురహంకారి
అమెరికాలో సిక్కుల ప్రార్ధనామందిరం గురుద్వారా లో జొరబడిన తెల్లజాతి దురహంకారి (వైట్ సూపర్ మాసిస్ట్) ప్రార్ధనలో మునిగి ఉన్న ఆరుగురు సిక్కు మతస్ధులను కాల్చి చంపాడు. తీవ్రవాది కాల్పుల్లో కనీసం మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని ‘ది హిందూ’ తెలిపింది. విస్కాన్సిన్ రాష్ట్రంలో మిల్వాకీ సబర్బన్ ప్రాంతం అయిన ‘ఓక్ క్రీక్’ లోని సిక్కుల ప్రార్ధనామందిరం లో ఆదివారం ఉదయం ఈ హత్యాకాండ జరిగింది. విచారణ జరిపిస్తామని అమెరికా అధ్యక్షుడు ఒబామా హామీ ఇవ్వగా, ఇండియాలోని సిక్కు…
