టెక్నాలజీ: 2 గంటల్లో అమెరికా చేరగల చైనా సబ్ మెరైన్?

చైనా శాస్త్రవేత్తల కృషి ఫలిస్తే త్వరలో శబ్ద వేగంతో ప్రయాణించగల జలాంతర్గాములు చైనా అభివృద్ధి చేయవచ్చు. రెండు గంటల్లోనే షాంఘై నుండి శాన్ ఫ్రాన్ సిస్కోకు చైనా జలాంతర్గాములు చేరవచ్చు. ఇంకా చెప్పుకుంటే చైనా ప్రయోగించే టార్పెడోలు సముద్ర గర్భంలో అత్యంత వేగంతో ప్రయాణించి అమెరికన్ నౌకలను ధ్వంసం చేయవచ్చు. చైనా తలపెట్టిన  సాంకేతిక పరిజ్ఞానం ప్రస్తుతం మిలట్రీ రహస్యం. దీనికి సంబంధించిన సమాచారాన్ని చైనా మిలట్రీ అధికారి ఒకరు సౌత్ చైనా మోర్నింగ్ పోస్ట్  (ఎస్.సి.ఎం.పి)…