సుష్మ స్వరాజ్ కంటే మా నాన్నగారే బాగా డాన్స్ చేస్తారు -కాశ్మీరు ముఖ్యమంత్రి
ఆమరణ నిరాహార దీక్ష చేయబోయిన బాబా రాందేవ్ శిబిరంపై అర్ధరాత్రి అరెస్టు చేసి ఆయన మద్దతుదారులపై లాఠీ ఛార్జీ చేసినందుకు నిరసనగా బి.జె.పి సోమవారం మహాత్మా గాంధీ సమాధి “రాజ్ ఘాట్” వద్ద ఒక రోజు నిరసన తెలిపిన సంగతి విదితమే. తెల్లవారు ఝామున బి.జె.పి పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సుష్మా స్వరాజ్ తమ కార్యకర్తల ముందు నాట్యం చేసి పత్రికల పతాక శీర్షికలకెక్కారు. జాతిపిత మహాత్మగాంధి సమాధి వద్ద ప్రతిపక్షాల నాయకురాలు నాట్యం చేయడం కాంగ్రెస్…