షిండే గారు మళ్ళీ తొట్రుపడ్డారు…
అమెరికా ఉపాధ్యక్షుడు జోసెఫ్ బిడెన్ లాగా భారత హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండేకు తొట్రుపడం అలవాటుగా మారినట్లుంది. ప్రభుత్వం లోని పెద్దలు రహస్యంగా దాచిపెట్టుకోవాల్సిన అంశాలను బహిరంగంగా ప్రకటించి ఆనక నాలిక్కరుచుకోవడం జో బిడెన్ కు ఉన్న అలవాటు. ఆ అలవాటు వలన బిడెన్ పైన అమెరికాలో అనేక జోకులు వ్యాప్తిలో ఉన్నాయి. మన షిండే గారు కూడా చెప్పకూడని సంగతులు బైటికి చెప్పడం, అనకూడని మాటలు అనేయడం, ఆనక ‘సారీ‘ చెప్పడం మామూలుగా మారింది.…
