బంగ్లా నుండి కోటిమంది హిందువులు ఇండియా వస్తారట!
ఎద్దు ఈనింది అంటే దూడని దొడ్లో కట్టేయమన్నాడట వెనకటికొకరు! పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు, తృణమూల్ కాంగ్రెస్ నుండి బిజెపిలోకి దూకిన టర్న్ కోట్ సువేందు అధికారి చేసిన ప్రకటన ఇలాగే ఏడ్చింది! పత్రికల వార్తల ప్రకారం సువేందు అధికారి “సిద్ధంగా ఉండండి. బంగ్లాదేశ్ నుండి కోటి మంది హిందువులు (పశ్చిమ) బెంగాల్ కు వలస రాబోతున్నారు” అని ప్రకటించాడు. సువేందు అధికారి అంతటితో ఆగలేదు. ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్ళి బంగ్లాదేశ్ లో మైనారిటీ హిందువులపై జరుగుతున్న…
