కవోష్ణ జ్వాలల జిమ్ము సినబాంగ్ అగ్నికొండ -ఫోటోలు

ఇండోనేషియాలోని ఉత్తర సుమత్ర రాష్ట్రంలోని సినబాంగ్ అగ్ని కొండ ఇంకా మండుతూనే ఉంది. తానే రగిలే వడగాలై అగ్ని కిలలు విరజిమ్ముతోంది. గత సంవత్సరం సెప్టెంబర్ నుండి భారీ పరిణామాల్లో బూడిద, లావా, మంటలు ఆకాశంలోకి ఊస్తున్న సినబాంగ్ కొండ ధాటికి గ్రామాలకు గ్రామాలు ఖాళీ చేసి వలస పోవాల్సిన పరిస్ధితి. సినబాంగ్ కొండ చిమ్ముతున్న బూడిద పరిమాణాలను చూస్తే అక్కడేదో అణు బాంబు పేలినట్లే కనిపిస్తోంది. పైరో క్లాస్టిక్ వాయువు, బూడిద, మంటలు అని పిలుస్తున్న…