సి.ఐ.సి సంచలనం: రాజకీయ పార్టీలూ ఆర్.టి.ఐ పరిధిలోనివే

సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సి.ఐ.సి) సంచలన తీర్పు ప్రకటించింది. ‘మేము ఆర్.టి.ఐ (రైట్ టు ఇన్ఫర్మేషన్) పరిధిలోకి రాము’ అని చెబుతూ పిటిషన్ దారులు కోరిన సమాచారాన్ని ఇవ్వడానికి నిరాకరిస్తూ వచ్చిన రాజకీయ పార్టీలకు దిమ్మ తిరిగేలా ఈ తీర్పు ఉన్నది. రాజకీయ పార్టీలు అనేక విధాలుగా ఆర్ధికంగా ప్రభుత్వం నుండి లబ్ది పొందుతున్నందున అవి పబ్లిక్ ఆధారిటీ కిందకు వస్తాయని కనుక ప్రజలు కోరినప్పుడు తమ నిధులపై తగిన సమాచారం ఇవ్వాల్సిందేనని తీర్పు ఇచ్చింది. కాంగ్రెస్,…

అవిశ్రాంత లేఖాయుధ పోరాట యోధుడు సుభాష్ అగర్వాల్

ప్రణాళికా సంఘం కార్యాలయంలో టాయిలెట్ల కోసం 35 లక్షలు ఖర్చు పెట్టిన సంగతిని వెలికి తీసి దేశాన్ని నివ్వెరపరిచిన 62 సంవత్సరాల సుభాష్ అగర్వాల్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. టీ చుక్క ముట్టని ఈ లేఖాయుధుడు పత్రికలకు లేఖలు రాసి ఆ లేఖలనే ఆయుధాలుగా ప్రభుత్వంలోని అనేక విభాగాలలో జరుగుతున్న అనేక తప్పులను సవరించుకునేలా ఒత్తిడి చేసిన ధీమంతుడు. రాజకీయ నాయకులకు, బ్యూరోక్రాట్ అధికారులకు ప్రజల పట్లా, వారి అవసరాల పట్లా ఉన్న ఉదాసీనతనూ, ఛీత్కార…