శత సహస్ర కోటీశ్వరుడు సుబ్రతో రాయ్ అరెస్ట్

సహారా గ్రూపు కంపెనీల అధినేత సుబ్రతో రాయ్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. సుప్రీం కోర్టులో హాజరు కావాలన్న కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడంతో సుప్రీం కోర్టు రెండు రోజుల క్రితం నాన్ బెయిలబుల్ అరెస్టు వారంటు జారీ చేసింది. సుబ్రతో రాయ్ కోసం ఆయనకు చెందిన లక్నో నివాసంలో పోలీసులు వెతికినప్పటికి దొరకలేదు. సుబ్రతో కంపెనీల వద్దా, నివాసాల వద్దా పోలీసులు కాపు కాయడంతో పరిస్ధితి తీవ్రతను గమనించిన రాయ్ ఈ రోజు లక్నో…

సహారా బాస్ కి నాన్ బెయిలబుల్ వారంట్

సహారా గ్రూపు కంపెనీల అధినేత, క్రికెట్ ఇండియా టీం మాజీ స్పాన్సరర్ అయిన సుబ్రతో రాయ్ కి సుప్రీం కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంటు జారీ చేసింది. వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరుతూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ ను కోర్టు కొట్టివేసినప్పటికీ కోర్టుకు రాకపోవడంపై సుప్రీం ద్విసభ్య బెంచి ఆగ్రహం వ్యక్తం చేసింది. తల్లిగారి ఆరోగ్యం బాగాలేనందున హాజరు కాలేకపోయారన్న సుబ్రతో రాయ్ అడ్వకేట్, సో కాల్డ్ పేరు మోసిన క్రిమినల్ లాయర్…

సహారా: డబ్బెక్కడిదో చెప్పు లేదా సి.బి.ఐని పిలుస్తాం

సహారా కంపెనీల మోసం కేసులో సుప్రీం కోర్టు మళ్ళీ కొరడా విదిలించింది. సుప్రీం ఆదేశాల మేరకు మదుపుదారులకు 22,000 కోట్లు చెల్లించేశానని సహారా కంపెనీ చెప్పడంతో సుప్రీం కోర్టు మోసం శంకించినట్లు కనిపిస్తోంది. అంత డబ్బు ఎక్కడి నుండి తెచ్చి చెల్లించారో వివరాలు ఇవ్వాలని కోరింది. ‘డబ్బు ఎక్కడిదో మీకు అనవసరం’ అని సెబికి బదులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. డబ్బు ఎక్కడిదో చెప్పాలని లేదా సి.బి.ఐ విచారణకు ఆదేశిస్తామని సహారా అధినేత సుబ్రతో రాయ్…

సహారా నిలువు దోపిడి: పెట్టుబడిదారీ విధానం అంటే ఇదే

ప్రజల కష్టార్జితాన్ని పెట్టుబడిదారీ కంపెనీలు దోచుకుని జల్సా చేస్తాయన్న సంగతి చరిత్రలో అనేక కంపెనీలు అనేక సార్లు రుజువు చేశాయి. 2008 నాటి ప్రపంచ ఆర్ధిక సంక్షోభాన్ని తెచ్చిన వాల్ స్ట్రీట్ కంపెనీల పేరాశ, ఇన్వెస్టర్ల సొమ్ము కాజేసి తాము మేపే అమెరికా, బ్రిటన్ ప్రభుత్వాల చేత కూడా గడ్డి పెట్టించుకున్న గోల్డ్ మేన్ సాచ్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు, అంతర్జాతీయ ప్రామాణిక ఫైనాన్స్ వడ్డీ రేటు అయిన లిబర్ (Libor – London Interbank Offered…