ప్రవేటు స్కూళ్ళలోనూ పేదలకు ప్రవేశం, సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు

భారత అత్యున్నత న్యాయ స్ధానం చారిత్రాత్మ తీర్పు ప్రకటించింది. ప్రవేటు పాఠశాలల్లోనూ 25 శాతం సీట్లు పేద విద్యార్ధులకు కేటాయించాల్సిందేనని తీర్పు చెప్పింది. 2009 లో యు.పి.ఏ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆర్.టి.ఇ (రైట్ టు ఎడ్యుకేషన్) చట్టం రాజ్యాంగ బద్ధమేనని తీర్పు చెప్పింది. పాతిక శాతం సీట్లను పేదలకు కేటాయించాలన్న నిబంధన తమ ప్రాధమిక హక్కులకు భంగకరమన్న ప్రవేటు పాఠశాల వాదనను తిరస్కరించింది. ఉచిత నిర్భంధ విద్య భారత దేశ పిల్లలందరికీ ఉన్న ప్రాధమిక హక్కు…

“సల్వా జుడుం” ఏర్పాటు చట్ట విరుద్ధం -చత్తిస్‌ఘడ్ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు గడ్డి పెట్టిన సుప్రీం కోర్టు – 2

“(సల్వా జుడుం యొక్క) రాజ్యాంగబద్ధమైన సమ్మతిని కొలవడానికి ఆ బలగాల ప్రభావశీలత (effectiveness) ఒక్కటే కొలబద్ద కాజాలదు, కాగూడదు కూడా. ఛత్తీస్ ఘఢ్‌లో మావోయిస్టు/నగ్జలైట్ల కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఎస్.పి.ఓ లు ప్రభావవంతంగా ఉన్నాదన్న అంశం తప్పుడు ప్రతిపాదన, కాకుంటే అనుమానాస్పదమైన ప్రతిపాదన. వాదన కోసం నిజంగానే ఎస్.పి.ఓలు మావోయిస్టులు/ నగ్జలైట్లకి వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉపయోగపడుతున్నారని అంగీకరించినా, తద్వారా వారివలన చేకూరుతున్నాయంటున్న అనుమానాస్పద లాభాలు, రాజ్యాంగంపై ఉండవలసిన పవిత్ర నమ్మకం, గౌరవాలను పెద్ద ఎత్తున కోల్పోవడానికీ, సామాజిక క్రమబద్ధత…

“సల్వా జుడుం” ఏర్పాటు చట్ట విరుద్ధం -చత్తిస్‌ఘడ్ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు గడ్డి పెట్టిన సుప్రీం కోర్టు – 1

కేంద్ర ప్రభుత్వానికి, ఛత్తిస్ ఘడ్ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు గడ్డి పెట్టినంత పని చేసింది. ఛత్తిస్ ఘఢ్ లో మావోయిస్టులను ఎదుర్కోవడానికి గిరిజన తెగల్లోనే ఒక తెగకు శిక్షణ ఇచ్చి తుపాకులిచ్చి స్పెషల్ పోలీస్ ఆఫిసర్లుగా పేరుపెట్టి రిగిజనంపైకి వదిలింది. దీనివలన గిరిజన తెగల్లో తీవ్ర ఘర్షణలు తలెత్తి ఒక తెగపై మరొక తెగ దారుణంగా మారణ కాండకు తలపడడం మొదలైంది. గిరిజనులకూ, గిరిజనులకూ పెట్టి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వినోదం చూశాయి. ఈ పద్దతిని…