బ్రెగ్జిట్ చర్చలు 2017 మార్చిలో మొదలు -ప్రధాని
బ్రిటిష్ ప్రజల తీర్పు ‘బ్రెగ్జిట్’ ను అమలు చేసే ప్రక్రియ వచ్చే సంవత్సరం మార్చి నెలలో ప్రారంభం అవుతుందని బ్రిటిష్ ప్రధాని ధెరెసా మే ప్రకటించారు. కన్సర్వేటివ్ పార్టీ కాన్ఫరెన్స్ ను ప్రారంభిస్తూ ధెరెసా చేసిన ప్రకటన బ్రెగ్జిట్ విషయమై కాస్త స్పష్టత ఇచ్చిందని యూరోపియన్ యూనియన్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. కాగా బ్రిటన్ లోని బ్రెగ్జిట్ వ్యతిరేకులు సణుగుడు కొనసాగించారు. బ్రెగ్జిట్ ఓటింగ్ ముందు వరకు ‘రిమైన్’ (ఈయూ లో కొనసాగాలి) శిబిరంలో ఉన్న…
