ఆదాయ విభజన: ఆంధ్ర 51%, తెలంగాణ 49%

రాష్ట్ర ఆదాయంలో సగానికి పైగా వాటా హైద్రాబాద్ నగరంలోనే వస్తోందని కాబట్టి విభజన వల్ల (తెలంగాణ లేని) ఆంధ్ర ప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుందని విభజన వ్యతిరేకులు వ్యక్తం చేస్తున్న ప్రధాన ఆందోళన. ఈ విధంగా ఆందోళన పడాల్సిన అవసరం లేదని వివరిస్తూ ఈ బ్లాగ్ లో ఒక ఆర్టికల్ ప్రచురించడం జరిగింది. సదరు ఆర్టికల్ లోని అంశాలను దాదాపు ధ్రువపరుస్తూ ఈ రోజు ఈనాడు పత్రిక రాష్ట్ర ఆదాయాల విశ్లేషణ ప్రచురించింది. ఇంకా చెప్పాలంటే నేను వేసిన…

రాష్ట్రపతి పాలన ఎత్తుగడ? -కత్తిరింపు

తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, సీమాంధ్ర ఉద్యమం, కేంద్ర ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వక అయోమయ సృష్టి ఇత్యాది అంశాలపై కాస్త వాస్తవానికి దగ్గరగా విశ్లేషణలు, విమర్శలు, సూచనలు ప్రచురిస్తున్నది ఆంధ్ర జ్యోతి దిన పత్రికే అనుకుంటాను. సి.ఎం కిరణ్ కుమార్ రెడ్డి ని ఇంటర్వ్యూ చేయడం ద్వారా ఇతర పత్రికలు, ఛానెళ్ల కంటే ఒక అడుగు ముందే ఉన్నది ఆ పత్రిక. ‘రాష్ట్రపతి పాలన ఎత్తుగడ?’ శీర్షికతో వచ్చిన ఈ విశ్లేషణ ఈ రోజు (అక్టోబర్ 11, 2013) జ్యోతిలో…

హైద్రాబాద్ రెవిన్యూ, పెట్టుబడులు, వాస్తవాలు

‘ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన ఖాయం, వెనక్కి వెళ్ళేది లేదు’ అని కాంగ్రెస్ అధినాయకులు స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్భంగా సీమాంధ్ర నాయకులు హైద్రాబాద్ సెంటిమెంటును తమ ప్రాంత ప్రజల్లో విస్తృతంగా ప్రవేశపెట్టారు. దశాబ్దాల తరబడి సీమాంధ్రులు రాజధానిని అభివృద్ధి చేశారని, ఇప్పుడు వెళ్లమంటే ఎలా వెళ్తాం అని పెట్టుబడిదారులు, భూస్వాములు వాదిస్తున్నారు. వారి వాదనలను ప్రజలు కూడా మోస్తున్న పరిస్ధితి కనిపిస్తోంది. ‘హైద్రాబాద్ రెవిన్యూ ఆదాయం ఎలా పోగొట్టుకుంటాం?’ అన్న సూపర్ ధనికుల ప్రశ్నకు పై…

తెలంగాణ ఖాయమేనట!

శుక్రవారం ది హిందూ పత్రిక ఓ ఎక్స్ ప్లోజీవ్ కధనం ప్రచురించింది. ఈ కధనం ప్రకారం తెలంగాణ రాష్ట్రం రావడం దాదాపు ఖాయమైపోయింది. ఇక మిగిలింది సి.డబ్ల్యూ.సి నిర్ణయమే. బహుశా కోర్ కమిటీలో నిర్ణయం జరిగిపోయి దానిని ఫార్మలైజ్ చేయడానికి సి.డబ్ల్యూ.సి కి పంపి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వంలోని అభిజ్ఞ వర్గాలను ఉటంకిస్తూ పత్రిక ఈ కధనం ప్రచురించింది. హైద్రాబాద్ పరిస్ధితి ఏమిటన్నదే ఇప్పుడు చర్చల్లో ఉన్న అంశం తప్ప తెలంగాణా ఇవ్వాలా, వద్దా అన్నది…

తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేసిన కావూరి వ్యాఖ్యలు

బుధవారం నాడు తెలంగాణ లాయర్లు తనకు వినతి పత్రం ఇవ్వడానికి తన ఇంటికి వచ్చిన సందర్భంగా ఏలూరు ఎం.పి కావూరి, తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలంగాణ + సీమాంధ్ర = ఆంధ్ర ప్రదేశ్ ఎం.పిలు, ఎం.ఎల్.ఏలు, ఎం.ఎల్.సిలపై విరుచుకు పడటం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా పరిణామాలు ఒకింత వేగం పుంజుకోవడానికి దోహదం చేసింది. గురువారం జరిగిన, జరుగుతున్న పరిణామలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ లాయర్లు తమ ఇంటిని ముట్టడించారని కావూరి ఆరోపణ. కాదు,…