టెర్రరిస్టుల చేతుల్లో కొత్త 2 వేల నోట్లు!
పాత 500, 1000 నోట్లు రద్దు చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడి చెప్పిన కారణాల్లో ఒకటి: టెర్రరిజం ఫైనాన్స్ వనరులను దెబ్బ కొట్టడం. దొంగ నోట్లు, హవాలా డబ్బుతో సీమాంతర ఉగ్రవాదం లేదా పాకిస్తాన్ ప్రేరేపిత కాశ్మీర్ ఉగ్రవాదం పేట్రేగిపోతున్నదని, నోట్ల రద్దు ద్వారా టెర్రరిస్టు ఫైనాన్స్ వెన్ను విరిగిపోతుందని ప్రధాని పిడికిలి బిగించి మరీ చెప్పారు. ప్రధాని చెప్పడమే కాదు, నోట్ల రద్దు వలన కాశ్మీర్ లో టెర్రరిస్టు కార్యకలాపాలు హఠాత్తుగా ఆగిపోయాయని కూడా…

