సి.ఐ.సి వేటగాడొస్తే పార్టీల పక్షులన్నీ ఐక్యమౌతాయ్ -కార్టూన్

రాజకీయ పార్టీలు తమకు నిధులు ఎక్కడి నుండి వస్తున్నది సమాచారం ఇవ్వాలని సి.ఐ.సి (సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్) కొద్ది వారాల క్రితం తీర్పు చెప్పడంతో పార్టీలకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లే అయింది. పారదర్శకత గురించి ప్రబోధించే ఈ పార్టీలకు అకస్మాత్తుగా పారదర్శకత రాజకీయ పార్టీల హక్కులకు భంగకరంగా కనిపించడం ప్రారంభం అయింది. అది ఎంతవరకూ వచ్చిందంటే పార్టీలన్నీ ఐక్యమై ఏకంగా సమాచార హక్కు చట్టాన్ని (ఆర్.టి.ఐ చట్టం) సవరించేంతవరకూ. రాజకీయ పార్టీలు సి.ఐ.సి చెప్పినట్లుగా పబ్లిక్…

రాజకీయ పార్టీలకు విరాళాలు ఇలా వస్తాయా? -కార్టూన్

“అది కేవలం ముందు జాగ్రత్త కోసమే, వారి ఎన్నికల ఖర్చు పైన ఆర్.టి.ఐ దస్త్రం పడేస్తామని వారికి తెలుసు!” సమాచార హక్కు చట్టం పోయి పోయి రాజకీయ పార్టీల మెడకు చుట్టుకుంటోంది. ఏ పార్టీలయితే ప్రజలకు ప్రభుత్వం నుండి సమాచారం పొందే హక్కు ఉన్నదని సభలపై బల్లలు గుద్ది మరీ వాదించాయో, ఆ పార్టీలే ఇప్పుడు ఆ చట్టం తమకు వర్తించదని వాదిస్తున్నాయి. ప్రభుత్వాల ఆధారిటీని ఒక ప్రత్యేక (unique) పద్ధతిలో పార్టీలు తమ గుప్పెట్లో పెట్టుకుంటాయని,…

సి.ఐ.సి సంచలనం: రాజకీయ పార్టీలూ ఆర్.టి.ఐ పరిధిలోనివే

సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సి.ఐ.సి) సంచలన తీర్పు ప్రకటించింది. ‘మేము ఆర్.టి.ఐ (రైట్ టు ఇన్ఫర్మేషన్) పరిధిలోకి రాము’ అని చెబుతూ పిటిషన్ దారులు కోరిన సమాచారాన్ని ఇవ్వడానికి నిరాకరిస్తూ వచ్చిన రాజకీయ పార్టీలకు దిమ్మ తిరిగేలా ఈ తీర్పు ఉన్నది. రాజకీయ పార్టీలు అనేక విధాలుగా ఆర్ధికంగా ప్రభుత్వం నుండి లబ్ది పొందుతున్నందున అవి పబ్లిక్ ఆధారిటీ కిందకు వస్తాయని కనుక ప్రజలు కోరినప్పుడు తమ నిధులపై తగిన సమాచారం ఇవ్వాల్సిందేనని తీర్పు ఇచ్చింది. కాంగ్రెస్,…

అప్పు ఎగ్గొట్టిన పారిశ్రామికవేత్తల పేర్లు వెల్లడించండి, సమాచార కమిషనర్ సంచలనం

భారత పాలక పార్టీలన్నీ ఇన్నాళ్ళూ కాపాడుతూ వచ్చిన రహస్య సమాచారం ఒకటి, కొద్ది రోజుల్లో బట్టబయలు కానున్నది. ‘సమాచార హక్కు చట్టం’ అమలుకు ఉద్దేశించబడిన సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సి.ఐ.సి) ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తే బ్యాంకుల్లో ప్రజలు దాచుకున్న డబ్బుల్ని అప్పనంగా కాజేసిన బడా భోక్తల పేర్లు త్వరలో వెల్లడి కానున్నాయి. భారత పబ్లిక్ రంగ బ్యాంకులనుండి అప్పులు తీసుకుని చెల్లించకుండా ఎగవేసిన పారిశ్రామిక వేత్తల పేర్లను ఆర్.బి.ఐ డిసెంబరు 31 లోగా పబ్లిక్ గా…