అసలు మైకు పట్టనేల, పట్టితిపో…… -కార్టూన్
అంత భారీ భావాలు వ్యక్తపరచనేల, ఇంత భారం మోయనేల? – రాహుల్ ఇప్పుడు మైకు భారాన్ని మోస్తున్నాడు. మొదటిసారి ‘కాన్ఫేడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్’ (సి.ఐ.ఐ) గురువారం జరిపిన సమావేశంలో మైకు పట్టిన రాహుల్ గాంధీ పేదలను, ముస్లింలను, దళితులను పరాయీకరిస్తే ఆర్ధిక వృద్ధి తీవ్రంగా దెబ్బ తింటుందని బోధించాడు. సామాన్య మానవుడికి సాధికారత అప్పగించే విధంగా వ్యవస్ధాగత మార్పులు తేవలసి ఉందని, అందుకోసం కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చాడు. “వివిధ తరగతులను పరాయీకరించే రాజకీయాలతో ఆడుకుంటే…