విదేశీ గూఢచర్యానికి ‘వాణిజ్య ముసుగు’ కోసం అనుమతి కోరిన అమెరికా మిలట్రీ
విదేశాల్లో తాము సాగించే గూఢచార కార్యకలాపాలకు ‘వాణిజ్య ముసుగు’ కావాలంటూ అమెరికా రక్షణ విభాగం కాంగ్రెస్ అనుమతి కోరింది. విదేశాలలో వాణిజ్యవేత్తల ముసుగులో మిలట్రీ గూఢచర్యానికి పాల్పడడానికి అమెరికాకి చెందిన ‘డిపార్ట్ మెంట్ ఆఫ్ డిఫెన్స్’ (డి.ఒ.డి) అమెరికా కాంగ్రెస్ ముందు ప్రతిపాదనలు ఉంచిందని ‘ఇన్ సైడ్ డిఫెన్స్’ వెబ్ సైట్ తెలిపింది. అమెరికా సైనికులను నేరుగా రంగంలోకి దించడం వల్ల వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందనీ, వాణిజ్య ముసుగులో రహస్య మిలట్రీ కార్యకలాపాల కోసం అనుమతి…
