నాయకులు, ఉద్యోగులు, పోలీసులు… వీరే ప్రజల దృష్టిలో అత్యంత అవినీతిపరులు -సర్వే

ప్రజలు రాజకీయ నాయకుల వద్ద డబ్బులు తీసుకునో, మద్యం తాగో వారికి ఓట్లు గెలిపించినా ఎవరు అవినీతిపరులన్న విషయంలో వారు స్పష్టంగానే ఉన్నారని సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ సంస్ధ నిర్వహించిన “స్టేట్ ఆఫ్ ది నేషన్” సర్వేలో వెల్లడయ్యింది. భారత దేశ వ్యాపితంగా 1300 లొకాలిటీలలో జరిగిన ఈ సర్వే ప్రకారం ఎన్నికల్లో నెగ్గిన ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు సమాజంలో అత్యంత అవినీతిపరులుగా ప్రజలు భావిస్తున్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో 43 శాతం మంది రాజకీయ నాయకులు అత్యంత అవినీతిపరులుగా…

ముగ్గురు భారతీయుల్లో ఇద్దరు లోక్ పాల్ గురించి అసలు విననే లేదు -సర్వే

అన్నా హజారే, ఆయన నాయకత్వంలోని పౌర సమాజ కార్యకర్తల బృందం సాగించిన ప్రచారం, కార్యకలాపాలు గత మూడున్నర నెలలనుండి లోక్ పాల్ వ్యవస్ధ గురించిన వార్తలను భారతీయ మీడియా తప్పనిసరిగా ప్రచురించేలా చేశాయి. లోక్‌‌పాల్ అనే వ్యవస్ధ భారత ప్రభుత్వంలోని అత్యున్నత స్ధాయిలో సాతుతున్న అవినీతిని అడ్డుకోవడానికి ఉద్దేశించిందని, అవినీతిపై వాళ్ళ ఆందోళన పతాక శీర్షికలకు ఎక్కేవరకూ చాలా మంది అక్షరాస్యులకు కూడా తెలియదంటే అతిశయోక్తి కాదేమో. ఐతే మొత్తం మీద చూస్తే భారతీయుల్లో నూటికి అరవై…