జనారణ్యంలోకి చొరబడ్డ చిరుతతో ఫారెస్టు గార్డుల ఘర్షణ -ఫోటోలు

ప్రకృతిపై మనిషి సాగించిన పోరాటంలో మనిషిదే అంతిమ విజయం. విజయంతో సంతృప్తి చెందిన మనిషి ధన ధాహంతో ప్రకృతి వినాశనానికి పూనుకుంటున్నాడు. దానితో జనారణ్యం సహజారణ్యంలోకి చొచ్చుకెళ్తోంది. ఫలితంగా జంతువులకు తమ సహజ నివాసంలో జాగా లేక జనారణ్యంలోకి రాక తప్పడం లేదు. రియల్ ఎస్టేట్ రంగ కాసుల దాహం కావచ్చు, అడవుల్లో దొరికే సహజ ఖనిజ వనరులపై బిలియనీర్ల కన్నుపడటం వలన కావచ్చు, అడవుల్లో జంతుజాలానికి నిలవ నీడ లేకుండా పోయింది. ఖనిజాల కోసం, గనుల…