ఐక్యరాజ్య సమితి తప్పుడు సమాచారం ఇస్తోంది -సిరియా అధ్యక్షుడు
సిరియాలో ప్రజల మరణాలపై ఐక్యరాజ్య సమితి ఇస్తున్నవి తప్పుడు లెక్కలని సిరియా అధ్యక్షుడు బషర్ ఆల్-అస్సద్ తెలిపాడు. అమెరికా వార్తా సంస్ధ ఎబిసి న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం చెప్పాడు. సిరియా లో నాలుగు వేల మంది చనిపోయారని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. సిరియా వచ్చి ఇక్కడ సర్వే జరిపి నిజా నిజాలు వెల్లడించాలని సిరియా అధ్యక్షుడు కోరాడు. సిరియా భద్రతా దళాలు తన సొంత దళాలు కాదని బషర్ అన్నాడు. దళాలను తాను…