హక్కాని గ్రూపుపై దాడులు చేసే సమస్యే లేదు, అమెరికాకి తెగేసి చెప్పిన పాక్

ఆఫ్ఘనిస్ధాన్‌లోని తాలిబాన్ మిలెటెంటు గ్రూపుల్లో అమెరికా అమితంగా భయపడుతున్న హక్కానీ గ్రూపుపైన దాడులు చేసే సమస్యే లేదని పాకిస్ధాన్ ఆర్మీ తేల్చి చెప్పింది. అమెరికా ఎన్ని ఒత్తిడులు తెచ్చినప్పటికీ తాము ఇప్పటివరకూ చేస్తున్న దాని కంటే కొంచెం కూడా ఎక్కువ చేసేది లేదని పాకిస్ధాన్ ఆర్మీ నిర్ణయించుకున్నట్లుగా అభిజ్ఞవర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. రెండు వారాల క్రితం తాలిబాన్ మిలిటెంట్లు కాబూల్ లోని హై సెక్యూరిటీ జోన్ లోకి ప్రవేశించి నిర్మాణంలో ఉన్న భవంతిని ఆక్రమించుకుని సమీపంలోని…