అగ్ని కొండల దేశంలో మరో బూడిద కాలం -ఫొటోలు

ఎండాకాలం, శీతాకాలం, వర్షాకాలం తరహాలో ఇండోనేషియా దేశస్ధులు బూడిద కాలం కూడా ఒకటుందని చదువుకోవాల్సిన రోజులు. అగ్ని పర్వతాలకు నిలయం అయిన ఇండోనేషియా ప్రజలకు అగ్ని కొండలు బద్దలు కావడం కొత్త కాకపోయినా ఈసారి మాత్రం వరుస పేలుళ్లతో భయోత్పాతం సృష్టిస్తున్నాయి. సినబాంగ్ అగ్ని పర్వతం ఆరు నెలల కాలంలో మూడోసారి బద్దలై నిప్పులు చెరుగుతుండగా దానికి కెలుద్ అగ్ని పర్వతం కూడా జత కావడంతో అనేక మంది మరణించారు. ఫిబ్రవరి 14 తేదీన జావా ద్వీపంలోని…

ఇదే.. ఇదే… రగులుతున్న అగ్ని పర్వతం!

‘రగులుతున్న అగ్ని పర్వతం’ అనగానే మనకు గుర్తొచ్చేది కృష్ణ నటించిన ‘అగ్ని పర్వతం’. కృష్ణ గారి నటన పుణ్యమాని బహుశా అనేకమంది అగ్ని పర్వతం రగులుతున్నప్పుడు ఎలా ఉంటుందో ఊహించుకునే శక్తిని కోల్పోయి ఉంటారు. మన సినిమా వాళ్ళు అగ్ని పర్వతం అనగానే నిప్పు కణికాలతో ఎర్రెర్రని మంటలు విరజిమ్మే దృశ్యాలనే మనకి అలవాటు చేశారు. కానీ అగ్ని పర్వతం బద్దలయినపుడు లావా విరజిమ్మడం అనేది ఒక భాగం మాత్రమే. లావాతో పాటు పెద్ద ఎత్తున బూడిద,…