కంగనా చెంప ఛెళ్ళుమనిపించిన కానిస్టేబుల్

బిజేపి తరపు అభ్యర్థిగా హిమాచల్ ప్రదేశ్ లో పోటీ చేసి ఎంపిగా గెలుపొందిన సినీ నటి కంగనా రణావత్ అనూహ్య రీతిలో ఒక సాధారణ మహిళా కానిస్టేబుల్ చేతిలో చెంప దెబ్బ తిన్నది. తమ జీవనోపాధిని దెబ్బ తీసే ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసే సాధారణ శ్రామిక ప్రజలకు మద్దతు ఇవ్వడం అటుంచి వారి పట్ల ఎంత మాత్రం సానుభూతి చూపకపోవడమే కాకుండా వారిని అభ్యంతరకర పదజాలంతో దూషించడానికి వెనుకాడబోనని కంగనా రణావత్ అనేక సార్లు…