జలాంతర్గామి పేలుడు: గుర్తుపట్టలేని స్ధితిలో శవాలు
ముంబై డాక్ యార్డ్ లో అనూహ్య కారణాలతో పేలిపోయి మునిగిపోయిన ‘ఐ.ఎన్.ఎస్ సింధూరక్షక్’ జలాంతర్గామి నుండి నాలుగు శవాలను వెలికి తీశారు. ఈ శవాలు గుర్తు పట్టలేని స్ధితిలో ఉన్నాయని తెలుస్తోంది. మంటల్లో పూర్తిగా కాలిపోవడంతో డి.ఎన్.ఏ శాంపిల్ సహాయంతో గుర్తుపట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జలాంతర్గామిలో సజీవులుగా ఎవరైనా మిగిలి ఉండే అవకాశాలు పూర్తిగా అడుగుంటాయని అధికారులు చెబుతున్నారు. నేవీ చీఫ్ అడ్మిరల్ డి.కె.జోషి మాత్రం అద్భుతం జరిగే అవకాశం లేకపోలేదని జలాంతర్గామి లోపల గాలి గదుల్లో…
