యూరప్ రుణ సంక్షోభంలో తదుపరి సమిధలు ఇటలీ, స్పెయిన్? -కార్టూన్
అమెరికా అప్పు వ్యవహారం గత రెండు మూడు నెలలది మాత్రమే. యూరప్ అప్పు సంక్షోభం ఒకటిన్నర సంవత్సరాలుగా నలుగుతోంది. గ్రీసుతో మొదలుకుని ఐర్లండ్, పోర్చుగల్ వరకూ యూరప్ అప్పు సంక్షోభం వ్యాపించింది. అంటే ఆ దేశాలకు సాధారణ స్ధాయిలో అప్పులు దొరికే పరిస్ధితి లేదు. దానితో ఆ దేశాలకు ఇతర యూరోజోన్ దేశాలు బెయిలౌట్ పేరుతో ఉమ్మడిగా రుణాలు ఇవ్వాల్సి వచ్చింది. ఈ మూడు దేశాల తర్వాత స్పెయిన్, ఇటలీలదే వంతు అని ఆర్ధిక పండితులు భావిస్తున్నారు.…